వాడ బలిజ సేవా సంఘం మండల అధ్యక్షులుగా బొల్లె సునీల్ 

Written by telangana jyothi

Published on:

వాడ బలిజ సేవా సంఘం మండల అధ్యక్షులుగా బొల్లె సునీల్ 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద గురువారం వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మండల కమిటీని ఎన్నుకొన్నారు. మండల అథ్యక్షులు గా బొల్లె సునీల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వెంకటాపురం మండలం తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి వాడ బలిజ కులస్తులు ఏజెన్సీ ప్రాంతంలో ఎదుర్కొంటున్న సమస్యలు, మరియు హక్కులపై మెమోరాండం ను తాసిల్దార్  కి అందజేశారు. అనంతరం వెంకటాపురం సి.ఐ .బండారి కుమార్ ని కలిసి రాష్ట్ర వాడబలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో శాలువతో సన్మానించారు.ఈ ప్రాంతంలో వాడ బలిజ కులస్తుల స్థితిగతులపై వివరించారు. ఈ కార్యక్ర మంలో తెలంగాణ రాష్ట్ర వాడ బలిజ సేవ సంఘం అధ్యక్షు లు డర్ర దామోదర్, రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జున రావు, ములుగు జిల్లా ఉపాధ్యక్షులు గగ్గురి రమేష్, వాజేడు మండల అధ్యక్షులు గార నాగార్జున, ఉపాధ్యక్షులు సుగం ధపు సాంబశివరావు, కార్యదర్శి బోగట విజయ్ కుమార్, జిల్లా నాయకులు, ఉప సర్పంచ్ బొల్లె మల్లికార్జున్, డేక్క శేఖర్, ఉపాధ్యక్షులు కొప్పుల వెంకటేశ్వర్లు , బొల్లె సంటి , గార ఆదినారాయణ, డర్ర రవి, టౌన్ ప్రెసిడెంట్ శేషాద్రి, యూత్ ప్రెసిడెంట్ బొల్లె ముత్యాలరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ వాదం సుధాకర్ , కోశాధికారి బొల్లె సారయ్య, అధికార ప్రతినిధి బాణారి సమ్మయ్య, ముఖ్య సలహాదారు ఎక్కబోయిన సీతయ్య గారు, జిల్లా కమిటీ సభ్యులు బద్ది ఆదినారాయణ, ఎరాల శ్రీరాములు, ఎర్రాల కన్నయ్య, రమేష్ సాంబశివరావు, పోతురాజు, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now