చింతగూడెంలో వీడ్కోలుసమావేశం
కన్నాయిగూడెం, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండలంలో తెలంగాణ టీచర్స్ యూనియన్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు ఏటూరునాగారం మండలంలో గత 14 సంవత్సరాలుగా వివిధ పాఠశాలల్లో పనిచేసి ఇటీ వల జరిగిన పదోన్నతి బదిలీలలో జిల్లాలోని వివిధ మండలా లకు పదోన్నతి బదిలీలపై వెళ్లిన టి టి యు ములుగు జిల్లా సంఘ సభ్యులకు ప్రాథమిక పాఠశాల చింతగూడెంలో వీడ్కోలు సమావేశం జరిగింది.ఈ సమావేశం కోరగట్ల రవీందర్ టిటి యు ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ టీచర్స్ యూనియన్ ములుగు జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ సర్వర్ అహ్మద్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం ఉపాధ్యాయ సంఘాల తో పాటు తెలంగాణ టీచర్స్ యూని యన్ పోరాటంలో ముందుండి నడిపించిందన్నారు. టిటియు సంఘం ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేస్తుంద న్నారు. సంఘం ఆధ్వర్యంలో వీడ్కో లు సన్మాన గ్రహీతలు బండారురాజమౌళి, కొండపర్తి సదానందం, పోశెట్టి రామా రావు, జగన్ కుమార్,ఆర్ ఎన్ స్వామి, పి సతీష్ కుమార్, మహమ్మద్ సర్వర్ అహ్మద్, లను శాలువాల తో ఘనంగా సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో వీటియు ములుగు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు అమీర్శెట్టి సారంగ పాణి అంగన్వా డి టీచర్ పోడెం సుజాత, ముష్కమల్ల సాంబయ్య, విద్యార్థు ల తల్లిదండ్రులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.