కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
నర్సంపేట,తెలంగాణ జ్యోతి: కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సిటిజన్స్ క్లబ్ ఆవరణలో ఎన్నుకున్నారు. వరంగల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి అబ్దుల్లా ఖాన్, ఉపాధ్యక్షులు రాంరెడ్డి, కోశాధికారి ముఖర్జీ, సహాయ కార్యదర్శి మల్లికార్జున్ పర్యవేక్షణలో నర్సంపేట మండల కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికయింది. ముఖ్య సలహాదారులుగా ఎర్ర జగన్మోహన్ రెడ్డి, నాడం సాంబయ్య, గండి నర్సయ్య గౌడ్, అధ్యక్షులుగా నల్ల శివశంకర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా పుల్లూరి స్వామి గౌడ్, సోనబోయిన సారంగపాణి, కందికొండ రాజహంస, చుక్క రాజేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్,పుల్లూరి శ్రీనివాస్ గౌడ్, సహాయ కార్యదర్శులుగా గూడెపు బిక్షపతి , వేముల వేణు గౌడ్, దార్ల రాజేందర్, నిమ్మల శ్రీనివాస్ కోశాధికారిగా కందుల స్వామి గౌడ్, కమిటీ సభ్యులుగా పరికి ప్రశాంత్, ఓరుగంటి మహేష్, ఉరుసుల శేఖర్, వజ్జ రాజేష్,కుంట విజేందర్, నల్లబెల్లి రజిత మీడియా ఇన్చార్జిగా దండుగుల ప్రభాకర్ లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు నల్ల శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ.. నర్సంపేట ప్రాంతంలో కబడ్డీ క్రీడలను అభివృద్ధి పరచడానికి తన వంతు కృషి చేస్తానని, తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్,,పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నర్సంపేట ప్రాంతంలో కబడ్డీ క్రీడ అభివృద్ధికి ఎన్నో సంవత్సరాల నుండి సహకారాలు అందించి క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా కబడ్డీ క్రీడా మరింత అభివృద్ధి పరచడానికి తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట డివిజన్ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి గుండేటి రవీం దర్ గౌడ్, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ బానోతు దేవిలాల్ , చెన్న బోయిన రామదాస్ , కబడ్డీ కోచ్ యాట రవికుమార్, నర్సంపే ట మండల వివిధ గ్రామాలలోని కబడ్డీ సీనియర్ పాల్గొన్నారు.