బిఆర్ఎస్ అభ్యర్థి గెలవాలని బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు 

Written by telangana jyothi

Published on:

బిఆర్ఎస్ అభ్యర్థి గెలవాలని బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు 

  • జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీ నర్సింహారావు

తెలంగాణ జ్యోతి,ఏటూరునాగారం: ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి భారీ మెజార్టీతో గెలవాలని పార్టీ శ్రేణులతో కలిసి ఏటూరునాగారం గ్రామంలోని బొడ్రాయి వద్ద బిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు.అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి మండల కేంద్రంలో ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం కై అమలు చేసిన పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి నాగజ్యోతిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ ప్రచారంలో జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారావుకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతూ మద్దతు తెలిపారు.ఈ సందర్బంగా ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ మండలంలోని పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రచారంలో ఏ ఇంటికి వెళ్ళినా బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన ఏదో ఒక పథకం గూర్చి తెలుపుతూ కెసిఆర్ కు మద్దతు పలుకుతున్నారని అన్నారు.ప్రజల నుండి వస్తున్న స్పందనను చూస్తుంటే బిఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో హత్య రాజకీయాలు,గుండా రాజకీయాలు మొదలవుతాయనేది ఎంపీ ప్రభాకర్ పై జరిగిన హత్యాయత్నమే అందుకు నిదర్శన మన్నారు.అలాంటివారు ప్రచారానికి వస్తే తరిమికొట్టాలన్నారు. కెసిఆర్ పదేళ్ల పాలనలో రాజకీయ హత్యలు,మత కల్లోలాలు లేకుండా తెలంగాణను ప్రశాంతంగా సుభిక్షంగా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు చేస్తూ మభ్యపెట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులను తీసుకువెళ్తున్నారో,వారే వచ్చి గులాబీ జెండా చేతబట్టి నాగజ్యోతిని గెలిపిస్తారన్నారు. జిల్లా అధ్యక్షునిగా తను, ఎమ్మెల్యే అభ్యర్థిగా నాగజ్యోతి ఖరారు అయ్యాకే ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంత ప్రజల కష్టాలను వివరించడంతో ఏటూరునాగారం డివిజన్ గా సాధించుకున్నామన్నారు. అంతేకాకుండా ప్రతి ఏటా జరుగుతున్న అగ్ని ప్రమాదాల దృష్ట్యా కేసీఆర్ కు,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ కి పెట్టిన నివేదికల మేరకు ఫైర్ స్టేషన్ కూడా మంజూరు చేశారన్నారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలే కాకుండా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారన్నారు.తెలంగాణ పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలనుకునేదే బీఆర్ఎస్ పార్టీ అని, మేమంతా బిఆర్ఎస్ సైనికులై ప్రతి ఇంటింటికి తిరిగి భారీ మెజార్టీతో బడే నాగజ్యోతి గెలిపించుకుంటామని ధీమా వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి అంతటి విజయ,జెడ్పి కో ఆప్షన్ వలియాబీ, పిఏసిఎస్ చైర్మన్ కూనూరు అశోక్,మండల అధ్యక్షుడు గడదాసు సునీల్, నాయకులు కాకులమర్రి ప్రదీప్ రావు,ఎంపిటిసి కోట నర్సింహులు, నాయకులు చంద్రబాబు,తుమ్మ మల్లారెడ్డి,కూనూరు మహేష్,టౌన్ అధ్యక్షుడు ఖాజా పాషా,రాం నర్సయ్య, వెంకటేష్,తాడూరి రఘు,ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

Tj news

1 thought on “బిఆర్ఎస్ అభ్యర్థి గెలవాలని బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు ”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now