వెంకటాపురం పంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం మేజర్ పంచాయతీ కార్యాల యంలో బుధవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వెంకటాపురం మేజర్ పంచాయతీ సర్పంచ్ చిడెం యామిలి బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత అయినా అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా సర్పంచ్ యామిలి అభిలాషిం చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఉప సర్పంచ్ ధనలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి గగ్గూరి ప్రవీణ్ , పంచాయతీ కార్మికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.