బెట్టింగ్ యాప్ ల పట్ల యువత మొగ్గు చూపకండి
– ప్రజలకు, యువతకు స్థానిక ఎస్సై ఇనిగాల వెంకటేష్ సూచన
కన్నాయిగూడెం, తెలంగాణ జ్యోతి : కష్టం లేకుండా డబ్బులు సంపాదించవచ్చు అని బెట్టింగ్ యాప్ ల పట్ల మొగ్గు చూపి ప్రాణాలు పోగొట్టుకోవద్దని, బెట్టింగ్ యాప్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని మండల ప్రజలకు, యువతకు ఎస్సై ఇనిగాల వెంకటేష్ సూచించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రస్తుతం ఐపియల్ సమయంలో విపరీతంగా ఒకరి చేతుల నుండి మరొకరి చేతిలోకి, ఒకరి ఫోన్ నుండి ఇంకొకరి ఫోన్ లోకి విపరీతంగా డబ్బులు మారుతుంటాయని, ఎవరో ఒక్కరూ మాత్రమే బెట్టింగ్ యాప్ ల ద్వారా డబ్బులు గెలుచుకున్నారని వెర్రితనంగా మీరు ఆవలలో చిక్కుకోవద్దని అన్నారు. ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్ లో యువత బెట్టింగ్ ఆడి ప్రాణాలు పోగొట్టుకోవడం మన కళ్ళముందే జరగడం రోజు చూస్తూనే ఉన్నామని, అటువంటి సంఘటనలు మన మండల పరిధిలో జరగకుండా చూడవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. ముఖ్యంగా యువత తల్లితండ్రులు అవసరాననికి మించి పిల్లలకు డబ్బులు ఇవ్వకూడదన్నారు. ఈ బెట్టింగ్ మహమ్మారి వలలో చిక్కుకొని ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి కాబట్టి మండలంలోని యువత ఈ బెట్టింగ్ యాప్ లకు దూరంగా ఉండాలని కన్నాయిగూడెం ఎస్సై ఇనిగాల వెంకటేష్ తెలిపారు.