చతిస్గడ్ వలస కూలీలకు అస్వస్ధత – సకాలంలో వైద్యం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చింతూరులో మిర్చి కోత పనులకు చత్తీస్గడ్ నుండి వలస వచ్చిన గుత్తి కోయ కూలీలకు సోమవారం సాయంత్రం నుండి సుమారు 12 మంది కూలీలు అస్వస్థకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య బృందం చింతూరు గ్రామానికి వెళ్లి కూలీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉడికి ఉడకని చికెన్ తినడం వల్ల అస్వస్థకు గురైనట్లు సమాచారం. ఈ మేరకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేసి, ఇతర వైద్య పరీక్షలతో కూలీలకు ట్రీట్మేంటు ఇచ్చారు. వీరిలో ఇద్దరికీ మలేరియా సోకినట్లు, ఆరోగ్య విస్తరణ అధికారి వేణుగోపాలకృష్ణ తెలిపారు. అలాగే వారి నివాసం ఉంటున్న ప్రాంతంలో బ్లీచింగ్ పౌడర్ తో పాటు ఇతర జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. బాగా నీరసంగా వీక్ గా ఉన్న కొంతమందిని పేరూరు ప్రభుత్వ వైద్యశాలలో ప్రత్యేక చికిత్సలు నిర్వహించి వైద్య సేవలను ఇచ్చినట్లు తెలిపారు. వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు వినియోగం, కలుషిత ఆహారం తీసుకోవద్దని తదితర ఆరోగ్య అంశాలపై వలస గొత్తి కోయ కూలీలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ వేణుగోపాలకృష్ణ, నర్సింగ్ ఆఫీసర్ రమ, హెల్త్ అసిస్టెంట్ శ్రీను ,జయంతి లాల్, ల్యాబ్ టెక్నీషియన్ అశ్విని, ఫార్మసిస్టు సతీష్, తదితరులు పాల్గొన్నారు.