పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య

పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య

పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లి గ్రామంలో పురుగుమందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… చిరుతపల్లి గ్రామానికి చెందిన చేలే మధు (31) గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి మధ్యానికి బానిసై నిత్యం త్రాగి తిరుగుతున్నపుడు మతిస్థిమి తం సరిగా లేనట్లు ప్రవర్తిస్తుండే వాడని వెంకటాపురం ఎస్.ఐ కె.తిరుపతి రావు తెలిపారు.  గతంలో 8 సంవత్సరాల క్రితం తాగిన మైకంలో పురుగుల మందు తాగగా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లి చికిత్స చేయించారు. గురువారం ఉదయం 10 గం. ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఇంటి ముందు ఉన్న పాకలో గుర్తు తెలియని పురుగుల మందు తాగుతుండగా అటుగా వస్తున్న అతని బావ అయిన కొర్స సందీప్ చూసి మృతుని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియపరిచారు. వారి సహాయంతో మధుని 108 అంబులెన్స్ లో మొదట చికిత్స నిమిత్తం వెంకటాపురం ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమంగా ఉండటం తో  ఇక్కడనుండి మెరుగైన వైద్యం నిమిత్తం ములుగు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అంబులెన్స్ లో తీసుకొని వెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుని తల్లి చేలే సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెంకటాపురం ఎస్సై కే తిరుపతిరావు మీడియాకు  తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment