రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి-ముగ్గురికి తీవ్ర గాయాలు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం శివాలయం చొక్కాల గ్రామాల మధ్యలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గంధం సత్యవతి(66) వృద్ధురాలు మృతిచెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటాపురం వైపు నుండి వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న గంధం సత్యవతి అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ముగ్గురిని హుటాహుటిన వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు చికిత్సకై తరలించారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు 108 అంబులెన్స్ లో తరలించారు. ఈ రోడ్డు ప్రమాద సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తును ప్రారంభించారు.