అటవీ గ్రామాల గుత్తి కోయలకు దుప్పట్లు పంపిణీ
– ఏటూరునాగారం సిఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై తాజుద్దీన్.
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : ఏటూరునాగారం అటవీ గ్రామాల గుత్తి కోయలకు స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ సహకారంతో ఆదివారం సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై తాజుద్దీన్ లు దుప్పట్లు, స్వెటర్స్ పంపిణీ చేశారు. గుత్తి కోయ గూడాలైన ముసలమ్మ తొగూడెం, మొండ్యాలతో గూడెం, చింత లపాడు, గుర్రాల బావి గూడాల ప్రజలకు 300 దుప్ప ట్లు, 220 స్వెటర్స్,100 మప్లర్స్ లను పీపుల్స్ హెల్పింగ్ చిల్ద్ర న్ సంస్థ హైదరాబాద్ వారి సౌజన్యంతో అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎముకలు కోరికే చలి నుం డి అటవి గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించడం కోసం అందిం చామన్నారు. గుడాలలో ఏమన్నా సమస్యలు నెలకొన్నట్ల యితే తమ దృష్టికి తీసుకొని రావాలని, సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు భోగం సంతోష్, శ్రీకాంత్, ప్రసన్న, అఖిల లతోపాటు తదితరులు పాల్గొన్నారు.