ఎంపీడీఓ భవనానికి రక్షనేది..?
– ప్రహరీ లేక అద్వానంగా తయారైన ప్రాంగణం
తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం:ములుగుజిల్లా కన్నాయి గూడెం మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి రక్షణ కరువైంది.చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో పశువు లకు అవాసంగా మారుతుంది. ఎంపీడీఓ భవనానికి రక్షణ లేక పోవడంతో రాత్రి సమయాల్లో మద్యం తాగడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఏవైనా పెళ్లిళ్లు జరిగే సందర్భంలో రాత్రి వేళల్లో ఆకయితాయిలు ఎంపీడీవో బిల్డింగ్ పైన మద్యం, సిగిరెట్లు సేవించడం వంటి పాల్పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీంతో ఎంపీడీఓ భవనానికి భద్ర త లేకుండా పోతుందని పలువురు ఆరోపిస్తున్నారు. కొన్ని చో ట్ల తదితర కార్యాలయల్లో తాళాలు పగలగొట్టి లోపల ఉన్న రికార్డులు, ఫర్నిచర్ చిందరవందరగా పడేసిన సందర్భాలు ఉన్నాయి.వెంటనే అధికారులు స్పందించి ఎంపీడీఓ భవనాని కి ప్రహరి గోడ నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.