కారును ఢీ కొట్టిన ఇసుక లారీ.
– త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఒంటిమామిడి మహితాపురం గ్రామాల మధ్య ప్రదాన రహదారిపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం.. వెంకటాపురం వైపు నుండి వాజేడు వైపు వెళ్తున్న ఇసుక లోడ్ లారీ అటువైపు నుండి వెంకటాపురం వైపు వస్తున్న కారును ఇసుక లారీ టైర్ పేలిపోవడంతో అదుపుతప్పి కారుని ముందు బాగా ఢీకొన్నది.ఈప్రమాదంలో కారులో ఉన్న ప్రయాణికులు తృటిలో సురక్షితంగా బయట పడ్డారు. అయితే లారీ డ్రైవర్ లారీని రోడ్డు పక్కన ఆపి పరారయ్యారు. ఈ రోడ్డు ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.