మా గ్రామ ప్రత్యేక అధికారి ఎక్కడ…?
తెలంగాణజ్యోతి,కన్నాయిగూడెం:మండలంలోపారిశుద్ధ్యం లోపిస్తోంది.. డ్రైనేజి కాలువలు లేకపోవడంతో వర్షం వస్తే రోడ్డు మీద ఉన్న నీరు ఇళ్లలోకి చేరుతుంది. పారిశుధ్యం లోపించి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని గ్రామస్తు లు వాపోతున్నారు. సర్పంచ్ పదవీకాలం ముగియడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ల స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది.అప్పటి నుండి నేటి వరకు కనీసం మా గ్రామానికి ప్రత్యేక అధికారి ఎవరు ఎక్కడు న్నారో తెలియని పరిస్థితి నెలకొనడంతో గ్రామాలలో పారిశు ధ్యం అద్వాన్నంగా మారి గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్తతో కనిపిస్తుంది. 15 రోజులకు ఒకసారైనా మిషన్ భగీరథ ట్యాంకును శుభ్రం చేయడం లేదు. బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లకపోవడం, గ్రామాల్లో మురుగునీరు, అంతర్గత రోడ్లు, తాగునీటి వసతి, అనేక వంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల డ్రైనేజ్ లను క్లిన్ చేయకపోవడంతో దుర్వాసన వెదల్లుతోంది. పారిశుధ్యం నిర్వహణ సరిగా లేకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగాయి. దీంతో ప్రజలు రోగాల బారిన బడే ప్రమాదం ఉంది. గ్రామాల ప్రజలు బాధలు ఎవరికి చెప్పుకోవాలని, చెప్పుకుందాం అంటే ప్రత్యేక అధికారి ఎవరో మాకు తెలియదని, ఇప్పటి వరకు మా గ్రామానికి ఆయన సందర్శిం చిన దాఖలాలు లేవని ప్రజలు వాపోతున్నారు.