కొత్త రేషన్ కార్డ్ ఇచ్చేది ఎన్నడో..!
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం: తెలంగాణ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లను ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని కాలయాపన చేస్తుంది. రేషన్ కార్డ్ జాబితాలో మిస్సయిన వారు ఎన్నో ఫిర్యాదులు చేస్తే రేషన్ కార్డు ఉన్నవాళ్లు కార్డు నెంబరు నమోదు చేసుకుంటే మళ్లీ కుటుంబ సభ్యుల్లో జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇదిగో కార్డు అదిగో కార్డు అని సుమారుగా సంవత్సరాలు చేసింది. ఇక కొత్తగా పెళ్లయిన వారు వేరు కుటుంబాలు ఉంటున్న వారి సంగతి అసలుకే మార్చిందిని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వం కూడా ఇవాళ రేపు అనుకుం టూ సంవత్సరం కాలం వస్తుంది. ఇంతవరకు రేషన్ కార్డు లేదు, రేషన్ లేదు వాళ్లకు బియ్యం, పప్పులు మరియు నిత్యవసర వస్తువులు కూడా ఇవ్వడం లేదని చాలామంది పల్లె, పట్టణ ప్రాంతాల్లో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదేసాకుతో రేషన్ కార్డులో పేరు నమోదు లేని వాళ్ళది రుణమాఫీ పెండింగ్లో పెట్టి వారిని మళ్లీ ఫోటోలు దింపి అప్లికేషన్లు తీసుకొని 10-15 రోజుల్లో రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పి నిమ్మకునీరెత్తినట్లు ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. రేషన్ జాబితాలో వాళ్ళపేరు నమోదు చేయడం లేదు. వారికి రేషన్ ఇవ్వడం లేదు. కమిటీలు వేస్తున్నాము ప్రక్షాళన చేస్తున్నాము. దసరా తర్వాత దీపాలు తర్వాత సంక్రాంతి తర్వాత కథలు, కహానీలు చెప్పడం తప్ప రేషన్ కార్డులు మాత్రం ఇవ్వడంలేదని, పండుగల వేళల్లోకూడా పస్తులేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.