గ్రామాల్లో దీపావళి పండగ సందడే సందడి
– బాణసంచా పేలుళ్లతో దద్దరిల్లుతున్న గ్రామాలు.
– కొనుగోలుదాలతో కిట కిట లాడు తున్న బాణాసంచా దుకాణాలు.
వెంకటాపురంనూగూరు, తెలంగాణజ్యోతి :దీపావళి పర్వ దినం సందర్భంగా గ్రామ గ్రామాన పండుగను అంగరంగ వైభ వంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రక రకాల ప్రమిదలలో శ్రేష్ట మైన విప్పనూనెను పోసి, దీపాలను క్రమ పద్ధతిలో అరుగుల పై పేర్చి పండుగకు స్వాగతం పలికారు. రంగురంగుల విద్యు త్ దీపాలను దేవాలయాలు,గృహాలలో అమర్చటంతో పండు గ వాతావరణం సంతరించుకున్నది. మండల కేంద్రమైన వెంక టాపురంలోని బాణాసంచా దుకాణాలు కొనుగోలుదాలతో కిక్కిరిసిపోయాయి. దీపావళి పర్వదినం సందర్భంగా దేవాల యాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపావళి పండుగ సందర్భంగా మండల కేంద్రమైన వెంకటాపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పల్లకి సేవలో వెంకటాపురం లో మంగళ వాయిద్యాల మధ్య ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా స్వామివారి పల్లకి సేవకు భక్తులు శుద్ధి జలం ఆరబోసీ పసుపు, కుంకాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీపావళి పండుగ సంద ర్భంగా భక్తులు స్వామివారి పల్లకి సేవకు ముందు చిచ్చు బుడ్లు, బాణాసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. దీపా వళి పండుగ సందర్భంగా పాడి పంటలు సక్రమంగా పండా లని, సకలజనులు సుఖశాంతులతో ఉండాలని, ఈ సందర్భం గా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.