ప్రయివేట్ విద్యాసంస్థలలో పాఠ్యపుస్తకాలను విక్రయిస్తే అడ్డుకుంటాం.
– ఏ.ఐ.ఎస్.బి నర్సంపేట డివిజన్ కమిటీ
తెలంగాణ జ్యోతి, నర్సంపేట : ప్రయివేట్ విద్యాసంస్థలలో పాఠ్యపుస్తకాలను విక్రయిస్తే అడ్డుకుంటామని అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏ. ఐ.ఎస్.బి నర్సంపేట డివిజన్ కన్వీనర్ బి.పూర్ణ అన్నారు. నర్సంపేట డివిజన్ కేంద్రంలో ఏ. ఐ.ఎస్.బి ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక సిద్ధార్థ కళాశాలలో జరగగా ముఖ్యఅతిథిగా డివిజన్ కన్వీనర్ బి.పూర్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ నర్సంపేట డివిజన్లో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ఆవరణలో పాఠ్యపుస్తకాలు, డ్రెస్సులు , సాక్స్ , టై , బెల్టులను ఏర్పాటు చేసి విక్రయిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని ఆయనే ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి విద్యా వ్యాపారం చేస్తూ పాఠశాల ఆవరణలో పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ విక్రయాలు చేస్తున్న పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను నర్సంపేట డివిజన్ లో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు నిబంధన లను పాటిస్తూ పాఠశాల ఆవరణలో పాఠ్యపుస్తకాలు మరియు స్టేషనరీ కౌంటర్లను పెట్టకూడదని ఆయన అన్నారు. నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారరీకరణ చేస్తున్న విద్యా సంస్థలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మండల నాయకులు శ్రీధర్ రాజు సాయి తదితరులు పాల్గొన్నారు.