బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి.
– జిల్లా అధ్యక్షుడు బలరాం
– బీజేవైఎం జిల్లా కార్యవర్గం ఎన్నిక
తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : జిల్లాలో భారతీయ జనతా పార్టీబలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం సూచించారు. బీజే వైఎం జిల్లా అధ్యక్షుడు రాయంచు నాగరాజు ఆధ్వర్యంలో యువమోర్చ నూతన జిల్లా కార్యవర్గాన్ని సోమవారం ఎన్ను కున్నారు. వారికి నియామక పత్రాలు అందించిన జిల్లా అధ్యక్షుడు బలరాం మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాల అమలు మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా చేసిందన్నారు. ప్రధాని మోదీ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నట్లు ముందస్తు సర్వే రిపోర్టులు తేల్చాయన్నారు. అంత్యోదయ లక్ష్యంగా సాగుతున్న పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, బీజేవైఎం నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. రాష్ర్టంలో ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. నూతనంగా ఏర్పాటు చేసిన బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శులుగా కత్తి హరీష్ గౌడ్, మాదరి శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా డి.దుర్గాప్రసాద్, ఎం.కృష్ణమూర్తి, కె.ప్రవీణ్, ఆర్.రంజిత్, ఎ.రాకేష్, కార్యదర్శులుగా కె.కుమారస్వామి, వి.చక్రవర్తి, రాకేష్, మహేష్, ప్రశాంత్, సోషల్ మీడియా కన్వీనర్ గా సుదీర్, అధికార ప్రతినిధిగా విక్రాంత్, కోశాధి కారిగా కె.పవన్, తదితరులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్ర మంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు భూక్య జవహర్లాల్ నాయక్, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు జినుకల కృష్ణాకర్ రావు, గిరిజన మోర్చ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కొత్త సురేదర్, రవిరెడ్డి, మండల అధ్యక్షుడు గాదం కుమార్, తదితరులు పాల్గొన్నారు.