అక్రమంగా తరలిస్తున్న టేకు కలప పట్టివేత
– కలపతో సహా వాహనం స్వాధీనం.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం ఫారెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని వెంక టాపురం మండలం తిప్పాపురం అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు వాహనంలో టేకు కలప తరలిస్తున్నట్లు సమాచారంతో అటవీ శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. పది టేకు దుంగలను తిప్పా పురం అటవీ ప్రాంతం నుండి బొలెరో పికప్ వాహనంలో తరలిస్తున్నట్లు అటవీ శాఖ ఉన్నతాధి కారులకు విశ్వసనీయ సమాచారం అందిగా, వెంటనే ఫారెస్ట్ ఉన్నతాధికారులు వెంకటాపురం రేంజి పరిదిలోనీ అధికారు లను సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆలుబాక సెక్షన్ ఆఫీసర్ చంద్రమోహన్, కొత్త గుంపు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మౌనిక, బేస్ క్యాబ్ సిబ్బంది అటవీ ప్రాంతంలో ఉన్న తిప్పాపురం వెళ్లారు. అక్కడ బొలెరో పికప్ వాహనంలో టేకు దుంగలను వాహ నంలో లోడ్ చేస్తుండగా, ఫారెస్ట్ అధికారుల బృందాన్ని చూసి కలప స్మగ్లర్లు, బొలెరో వాహనం డ్రైవర్ అడవుల్లోకి పరార య్యారు. వెంటనే సమాచారాన్ని ఫారెస్ట్ ఉన్నతాధికారులకు తెలియపరచారు. కలపతో సహ వాహనం స్వాధీనం చేసుకు న్నట్లు, ఆలుబాక ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చంద్రమోహన్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న కలప 1.876. సీఎం టి ఉంటుందని, రెండు లక్షల 52 వేల రూపాయలు విలువ ఉంటుందని మీడియాకు తెలిపారు. ఈ మేరకు అటవీ సంరక్షణ చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న టేకు కలప, వాహనాన్ని వెంకటాపురం మండల కేంద్రంలోని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి, ఆదివారం ఉదయం తరలించారు. తిప్పాపురం అటవి ప్రాంతం సరిహ ద్దుల్లోని చత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు టేకును ముక్కలు గా నరికి దుంగలుగా తయారుచేసి, అమ్ముకుంటున్నట్లు సమాచారంతో, అటవీ శాఖ అప్రమత్తమైంది.ఈ మేరకు ప్రత్యేక నిఘాతో వాహనం తో సహా టేకు స్వాధీనం చేసుకొని, అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.