ఆరు గ్యారెంటీల అమలుకు సమిష్టిగా పోరాడుతాం
తెలంగాణజ్యోతి,ఏటూరునాగారం : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ములుగు జిల్లా రెండవ మహాసభలో తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ముందుగా ఏటూరునాగారం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి బస్టాండ్ వరకు సిపిఎం నాయకులు సుమారు రెండువేల మందితో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తో పాటు పలువురు కమ్యూనిస్టు నాయకులు పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ ప్రజా, రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానా లను ఎండగడుతూ పార్టీ పరంగా ఉద్యమాలు చేయడానికి కార్యకర్తలు, నాయకులు ముందు వరుసలో ఉండాలని పిలు పునిచ్చారు. తెలంగాణాలో అభివృద్ది పేరిట రేవంత్ రెడ్డి కేంద్రం వద్ద తీసుకువచ్చిన 12 వేల 4 వందల కోట్ల నిధులతో ఎలాంటి అభివృద్ది చేపట్టారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లగచర్లలో ఫార్మ సిటీ పేరుతో రెండు పంటలు పండే ఆదివాసి రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల అమలుకు త్వరలోనే అన్ని కమ్యూనిస్టు పార్టీల భాగస్వా మ్యంతో సమిష్టిగా పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు జిల్లా నాయకులు, మండలాల నాయకులు పాల్గొన్నారు.