ప్రజల్లో అసంతృప్తి లేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుండ్లు
– ప్రజలకు ఏం చేశారని విజయోత్సవాలు చేసుకుంటాండ్లో చెప్పాలే
– కాళేశ్వరం నిర్వాసితులకు ఎక్కువ పరిహారం ఇప్పిస్తామనే మాట మర్చిండ్లు
– బీఆర్‌ఎస్ యుద్దం చేస్తనే రైతు భరోసా ఇస్తామంటుండ్లు
– సన్న వడ్లకే కాదు అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలే
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి:. కాంగ్రెస్ ప్రజా వంచన దినాల్లో బాగంగా శుక్రవారం కాటారం మండల కేంద్రంలో అంబేద్కర్ వర్థంతి సందర్భంగా వారి విగ్ర హానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం నిర సన కార్యక్రమం భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ ఛైర్పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్ తో కలిసి నిర్వహించారు. ఈ సంద ర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హమీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో అసంతృప్తినెలకొందని, ఓ వైపు ప్రజలు తిరుగబడుతుంటే ప్రజల్లో తమపై విశ్వాసం ఉందని చాటిచెప్పుకునేలా సభలు నిర్వహిస్తూ జనాలను తరలిస్తు న్నారని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలో ప్రజలకు ఏం చేశారని విజయోత్సవాలు చేసుకుం టాండ్లో సమాధానం చెప్పాలన్నారు. ఆరు గ్యారెం టీల్లో మహి ళలను, రైతులను, నిరుపేదలను మోసం చేసినట్లే విద్యార్దు లను, యువతను దగా చేశారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మానీఫెస్టో కమిటి చైర్మన్‌గా 420హమీలకు రూప కల్పన చేశామని గొప్పలు చెప్పుకునే మంథని ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఏ ఒక్క పథకం అమలు చేయలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు కేసీఆర్ ప్రభుత్వం సరైన పరిహారం ఇవ్వ లేదని, తాము అధికారంలోకి వస్తే ఎక్కువ పరిహారం ఇప్పిస్తా మని మానీఫెస్టోలో పొందుపర్చిన మంథని ఎమ్మెల్యే అధికా రంలోకి రాగానే ఆ హమీని మర్చిపోయాడని ఆయన ఎద్దేవా చేశారు. కనీసం భూనిర్వాసితుల ఊసే ఎత్తడం లేదన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఫార్మాసిటీలు లేకుండా చేస్తామని చెప్పి ఈనాడు ఫార్మా సిటీల కోసం స్వయంగాముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే రైతుల భూము లు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వివరించారు. పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందు కేనా విజయోత్సవ సంబరాలు నిర్వహించుకుంటున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, రౌడీలుగా చిత్రీకరించడం అలవాటుగా మారిందని, అలాంటి కేసులకు భయపడేది లేదన్నారు. ఇన్నాళ్లు పోలీసు లు బీఆర్‌ఎస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు చేశారని,కానీ కాటారం లాంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నాయ కులు చెప్పితేనే పోలీసులు ఫిర్యాదులు తీసుకునే పరిస్థి తులు నెలకొన్నాయని ఆయన అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంటే సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామంటూ ప్రకటించారని అన్నా రు. రైతు బంధు తీసేసి రైతులకుతీరని అన్యాయం చేశార న్నారు. కేవలం సన్నరకం వడ్లకే బోనస్ ప్రకటించిన ప్రభుత్వం మిగతా పంటలు సాగు చేసేవాళ్లు రైతులు కారా అని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో మిర్చి, పత్తితో పాటు రకరకాల పంటలు సాగు చేస్తుంటారని, అలాం టి వాళ్లకు సైతం బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుబంధు ఇస్తే అన్ని రకాల పంటల సాగుకు ఉప యోగించుకునే వారని, కానీ కేవలం సన్నవడ్లకు ఇవ్వడంతో రైతులకు నష్టమేనని ఆయన అన్నారు. ప్రజల్లో తమ ప్రభు త్వంపై వ్యతిరేకత లేదని వందల కోట్లు పెట్టి సభలు పెడు తున్నారని, ఆనాడు ఈ ప్రాంతంలో బహిరంగ సభ పెట్టి ప్రజలు తెలంగాణ కోరుకుంటలేరని చెప్పేలా ఆనాటి ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సభ పెట్టించారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై కాంగ్రెస్ ప్రజావంచన దినాలు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఏ వర్గాన్ని వదల కుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ఇప్పటి వరకు ఇచ్చిన హమీల్లో ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయని ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు. నయవంచన ప్రభుత్వంపై పోరాటం చేసి మెడలు వంచాలని, లగచర్ల, నిర్మల్ తరహాలో ప్రజల తిరుగుబాటు తప్పదని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పుట్ట మధు, జక్కు హర్షిని, జక్కు రాకేష్, జోడు శ్రీనివాస్, రామిల్ల కిరణ్, వూర వెంకటేశ్వర్రావు, మందల లక్ష్మారెడ్డి, పబతకాని సదువలి, శ్రీలక్మి, గాలి సదువలి, మమత, నాగమణి, జక్కు శ్రవణ్, వంగల రాజేంద్ర చారీ, ఉప్పు సంతోష్, గుండ్లపల్లి అశోక్, చాకినాల ప్రశాంత్, కాటారపు రాజామౌళి, కొండపర్తి రవి, గడ్డం చంద్రయ్య, పోడేటి లింగయ్య, తుటి మనోహర్, వంశీ, తుంబర్ల రమణ, బోడ తిరుపతి, మేడిగడ్డ దుర్గారావు, చీమల వంశీ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.