బీట్ ఆఫీసర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
– జిల్లా అటవీ అధికారికి ఫిర్యాదు చేసిన అటవీ అధికారుల సంఘం
ములుగు, తెలంగాణ జ్యోతి : మేడారం జాతరలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బి.శ్రీనివాస్ కుటుంబం పై ఈనెల 23న ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం చేసిన భౌతిక దాడిని ములుగు జిల్లా అటవీ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జూనియర్ అటవీ అధికారుల సంఘం, ములుగు ఎటూరు నాగారం యూనిట్ సభ్యులు మాట్లాడుతూ ఎఫ్ బి ఓ శ్రీనివాస్ మేడారం జాతర లో భార్య తో కలిసి సమ్మక్క-సారలమ్మల దైవ దర్శనానికి మొక్కులు చెల్లించుకొని డ్యూటీ కి హాజరు కావాలని యూనిఫామ్ లో వెళ్లి, పోలీస్ శాఖ వారి అనుమతి తీసుకోని దర్శనానికి వెళ్ళు సమయంలో ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం దాడి చేసి కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రోటోకాల్ వెహికల్ ని అడ్డగించి కొంతమేర ధ్వంసం చేయడం జరిగిందన్నారు. జరిగిన ఘటనపై జిల్లా ఫారెస్ట్ అధికారికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.తదుపరి ఇతర పై అధికా రులకు, మంత్రికి పిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. సదరు అధికారిపై శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో న్యాయం జరిగే వరకూ విధులను బహిష్కరిస్తామని వారు జిల్లా అటవీ శాఖ అధికారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అటవీ అధికా రుల సంఘం సర్కిల్ రిప్రెసెంటేటర్ సాంబు, ములుగు, ఏటూ రునాగారం యూనిట్ ప్రతినిధులు నరేందర్, శ్రీనివాస్, కోటేశ్వర్, రాజేష్, శ్యామ్ సుందర్, లలితా కుమారి, దీప్ లాల్, రూప్ సింగ్, రంజిత్, శేషుకుమార్, రాంప్రసాద్, రమేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.