తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి
– శుభాకాంక్షలు తెలిపిన ఐజేయు జిల్లా అధ్యక్షుడు షఫీ,ఉపాధ్యక్షుడు సతీష్
ములుగు,తెలంగాణ జ్యోతి:తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా ప్రజాపక్షం పేపర్ సంపాదకులు, ఐజేయు జాతీయ అధ్యక్షుడు కె. శ్రీనివాస్ రెడ్డి ని రాష్ట్ర ప్రభుత్వం నియమిం చింది. ఈ సందర్భంగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కి ఐజేయు ములుగు జిల్లా అధ్యక్షుడు ఎండీ షఫీ, ఉపాధ్యక్షుడు బేతి సతీష్ యాదవ్ లు అదివారం శుభా కాంక్షలు తెలియజేశారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యాక బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో జెర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జెర్నలిస్టులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నూత నంగా నియమించబడిన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సైతం జెర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తారని అన్నారు. జెర్నలిస్టులకు రాబోయే రోజుల్లో అంతా మంచి జరుగుతుందని పేర్కొన్నారు. శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఐజేయు జిల్లా నాయకులు కొండం రవీందర్, గంపల శివ, వాసు, జాలిగం శ్రీనివాస్, బైకని నటరాజు, చుంచు రమేష్, కేతిరి భిక్షపతి, ఒద్దుల మురళీ, ఎనగందుల శంకర్, కొమురయ్య, తదితరులు ఉన్నారు.