ప్రశ్నించే గొంతును గెలిపిద్దాం
– చట్ట సభలో మన గొంతును వినిపిద్దాం
– వరంగల్- ఖమ్మం -నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాజేష్ రెడ్డి ని మెజారిటీతో గెలిపించాలి
– మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలుపుకు సహకరించాలి
తెలంగాణ జ్యోతి ప్రతినిధి, ఏటూరునాగారం : ప్రశ్నించే గొంతుక నిత్యం ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి, ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, నిత్యం నిరుద్యోగుల కోసం పోరాడే నాయకుడు, అన్న అంటే నేనున్నా అనీ చెప్పే ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు, ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్న ఖమ్మం నల్గొండ వరంగల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఆభ్యర్థిగ బరిలో ఉన్నాడన్నారు. దీనిలో భాగంగానే ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ములుగు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్న పట్టభద్రులు మీ అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాన్యత ఓటుగా వేసి అన్నాను భారీ మెజారిటీతో గెలిపించి అన్నను శాసన మండల కి పంపించాల్సిందిగా కోరుతున్నాం అన్నను శాసన మండలికి పంపాల్సిందిగా కోరారు. మేధావులు యువకులు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మాటలను నమ్మి ఓటు వేసి మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. బిఆర్ఎస్ నాయకులు సైనికుల పనిచేస్తూ రాకేష్ అన్న కు మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్సీ ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ములుగు జిల్లా బిఆర్ఎస్ వి నాయకుడు దుర్గం రాజ్ కుమార్ నాయకులను నాయకులను కోరారు.