పేకాట స్థావరంపై వాజేడు పోలీసుల దాడి
– 15 మంది అరెస్టు, రూ. 22,300 స్వాధీనం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు పి.ఎస్ పరిధి లోని లక్ష్మీపురం అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై ఆది వారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. వాజేడు పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు పి.ఎస్ పరిధి లోని లక్ష్మీపురం అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై ఆది వారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతూ ఉన్న 15 మంది, పేకాట రాయుల్ని పోలీసు లు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 22 వేల 300 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వాజేడు పోలీస్ సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రుద్ర హరీష్ ఆదివారం సాయంత్రం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ దాడు ల్లో సిఆర్పిఎఫ్ డి.ఎస్పి సతీష్ కుమార్, సివిల్ మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.