గంజాయి పట్టివేత – ముగ్గురు అరెస్టు

Written by telangana jyothi

Published on:

గంజాయి పట్టివేత – ముగ్గురు అరెస్టు

– వెంకటాపురం సి.ఐ .బి. కుమార్ వెల్లడి. 

వెంకటాపురంనూగూరు, తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం శివాలయం వద్ద, శనివారం రాత్రి గంజాయి తీసుకు వస్తున్నట్లు నమ్మదగిన సమాచా రంతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఈ మేరకు ముగ్గురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలపై గంజాయి తరలిస్తుండగ పోలీసులకు పట్టు పడ్డారు. వీరంతా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా గోగుబాక, నెల్లిపాక ,యటపాకి ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. చింతా నాగేంద్ర ప్రసాద్, తిరువీధుల ప్రవీణ్, కనకం దుర్గాప్రసాద్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ మీడియా కు తెలిపారు. వారి వద్ద నుండి మూడు కిలోల 654 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 92,375 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. గంజాయి సమా చారాన్ని ప్రజలు పోలీసులకు తెలియజేయాలని, అలా తెలి యజేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచబడుతుందని ఈ సందర్భంగా సి.ఐ .కుమార్ ప్రజలకు కోరారు. వెంకటాపురం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కే. తిరుపతి రావు సిబ్బంది తదితరు లు పాల్గొన్నారు.

Leave a comment