కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు..!
– దరఖాస్తు చేసుకొని ఏండ్లుగా ఎదురుచూపులు
– కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వైనం
తెలంగాణజ్యోతి,కన్నాయిగూడెం:నూతన పింఛన్ మంజూ రు కోసం దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు అర్హులైన పింఛన్ దారులు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మండల పరిషత్ కార్యాలయం చుట్టు, నాయకుల చుట్టూ తిరుగుతున్న ఫలితం లేదని వాపోతున్నారు. దివ్యాంగుల విషయంలో సదరం క్యాంప్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకున్న ప్రభుత్వ నుంచి వెబ్సైట్ ఓపెన్ కావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నూతన పింఛన్ మంజూ రు చేయాలని అర్హులైన వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కన్నాయి గూడెం మండలంలో 11 గ్రామపంచాయతీలున్నాయి. గ్రామా లలో వివిధ కారణాలతో భర్తలు చనిపోవడంతో భార్యలు వితంతువవుతున్నారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబ పోషణ భారం భార్యలపై పడుతోంది. దీంతో పిల్లల చదువుల భారంతో పాటు కుటుంబ పోషణ వితంతువులకు కష్టంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది చిన్న వయసులోనే భర్త కోల్పోయి ఒంటరి జీవితాలతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితలు ఉన్నాయి. ఏళ్ళ తరబడి వితంతువులు పింఛను రాక కోసం ఎదురు చూస్తున్నారు. వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు పలు మార్లు దరఖాస్తు చేసుకున్న ఫలితం లేదని వాపోతున్నారు. ఒంటరి మహిళలు కూడా నూతన పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మండలంలోని ఆయా గ్రామ పంచాయతీలలో వితంతువులు, దివ్యాంగులు వివిధ రకాల అర్హులైన పింఛన్ దారులు వందలాది మంది దర్శనమిస్తున్నారు. గ్రామాల్లో ఒంటరి మహిళలు, వయసు పైబడినవారు, దివ్యాంగులు అర్హులైన వారికి ఇప్పటివరకు పంఛన్లు మంజూరు కావడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. పింఛన్ల రాక కోసం సంవ త్సరాల తరబడి ఎదురు చూస్తున్నారమని పేర్కొంటున్నారు.