పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం
– వెంకటాపురంలో భారీ ర్యాలీ
– రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన వెంకటాపురం సి.ఐ .కుమార్
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి: పోలీస్ అమర వీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పా టు చేశారు. ముందుగా వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్ ఆధ్వర్యంలో వెంకటాపురం పట్టణ పురవీధులలో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించగా పేరూరు, వెంకటాపురం, వాజేడు పోలీస్స్టేషన్ల సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు. డాక్టర్స్ వాలం టరీ బ్లడ్ బ్యాంక్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో డాక్టర్ ఎం.ఎ కరీం పర్యవేక్షణలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించగా సి.ఐ. బి. కుమార్ ప్రారంభించారు. వెంకటాపురం మండలం లోని చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో యువకు లు మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన యువకులకు ద్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్ర మంలో వాజేడు సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రుద్ర హరీష్, మూడు పి.ఎస్ ల సిబ్బంది, డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు ఎన్ .శ్రీకాంత్ మరియు సిస్టర్స్ పాల్గొన్నారు. అలాగే చేయూత సేవా సంస్థ అధిపతి చిడెం సాయి బృందం పోలీసుల మెగా రక్తదాన శిబిరానికి సహాయ సహకారాలు అందించారు.