నూతన తహశీల్దార్‌గా వేణుగోపాల్ బాధ్యతలు స్వీకరణ
తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం: కన్నాయిగూడెం మండ ల తహశీల్దార్‌గా వేణుగోపాల్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎండి సలీం కలెక్ట రేట్ సూపరింటెండెంట్ గా ములుగు వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం అందుబాటు లో ఉంటూ రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం ఆయనకు రెవెన్యూ కార్యాల యం సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.