పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలి
– పశు వైద్యాధికారి డా. రాజబాబు
మహాదేవపూర్,తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాల పల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో కుక్కకాటుపై నిర్లక్ష్యం చేయవద్దని అప్రమత్తంగా ఉండాలని పాడి రైతులకు అవగాహన నిర్వహించారు. బుల్లెట్ అకారం లో ఉండే రాబ్డిడో అనే వైరస్ కుక్క కాటు ద్వారా ఈ వ్యాధి, గేదెలు మరియు ఆవులకు చేరుతుంది. వైద్య పరిభాషలో ర్యాబీస్‌గా పిలుస్తారు. కుక్కలో వైరస్, నాడుల ద్వారా నాడీ కేంద్రానికి చేరుతుంది. అక్కడ విస్తరించి మెదడులోని కణాలను ధ్వంసం చేస్తుంది. ఈ వైరస్ నాలుగు నుంచి ఆరు వారాల్లో ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ మధ్య కాలంలోనే కుక్క సోమరిగా తిరుగుతూ ఏం తినకుండా జ్వరంతో బాధపడుతూ విచిత్రంగా ప్రవర్తిస్తుంది. కుక్క మెద డు మీద వైరస్ ప్రభావం పెరగడంతో కోపంతో జంతువులు మరియు మనుషులపైనా దాడి చేస్తుంది. కుక్క కరిస్తేనే ప్రాణాంతకమని భావించవద్దు. గోళ్లతో గీరిన, రక్కిన పండ్లు గీసుకపోయిన, అంతకుముందే ఉన్న గాయాలపై నాకిన, తినే ఆహారంలో మూతి పెట్టినా,తాగే నీటిలో చొంగ కార్చినా ర్యాబీ స్ వ్యాధి రావడానికి మార్గాలుగా భావించాలని రైతులకు సూచించడం జరిగినది. కుక్క కరువగానే, వైరస్ నరాల ద్వారా గంటకు మూడు మిల్లీమీటర్ల వేగంతో ప్రయాణించి మెదడుకు చేరి వ్యాధిని కలిగిస్తుంది. వ్యాధి లక్షణాలు 9 రోజుల నుంచి కొన్ని నెలల్లోపు కూడా బయటపడవచ్చు. సాధారణంగా నాలుగు నుంచి 8 వారాల్లో బయట పడు తాయి. మెడపై కరిస్తే వారం రోజుల్లో, ముఖం మీద కరిస్తే 30 రోజుల్లో, చేతులమీద కరిస్తే 40-60 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడుతాయి. కేవలం గీసుకపోయి గాయమైతే కొంత అలస్యంగా లక్షణాలు బయటపడుతాయి. లోతుగా పండ్లు దిగి కండను పీకేస్తే వ్యాధి త్వరగా బయటపడుతుంది. లక్షణాల్లో ప్రధానంగా కరిచిన చోట నొప్పి, వాపు, ఒళ్లు నొప్పులు, నీరసం ఆకలి మందగించడం, వాంతులు, పొడి దగ్గు, నాడీ మండల వ్యవస్థపై సంబంధిత లక్షణాలు కనిపి స్తాయి. చిక్కగా నోటి నుంచి ఉమ్ము రావడం, కోపం వంటి లక్షణాలు వస్తాయి. ర్యాబీస్ వ్యాధిని హైడ్రోఫోబీయా అని కూడా అంటారు. నీళ్లు చూస్తే కూడా గేదెలు భయపడు తాయి. కండరాలు బిగుసుకుపోవడం, ఫిట్స్ రావడం వంటి అనేక లక్షణాలు కూడా ఉంటాయి. కుక్క కాటు వేసిన తరు వాత ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా పెంపుడు జంతువులకు చికిత్సను చేయించాలి. పెంపుడు కుక్క అయినా యాంటీ రేబీస్ ఇంజక్షన్లు వేయించుకోవాలి. వ్యాక్సిన్‌మొదలు పెట్టిన రోజును జీరోగా తరువాత 3, 7, 14,. 30, 90 రోజుల్లో వ్యాక్సిన్ వేయించుకోవాలని పాడి రైతులకు సూచించడం జరిగింది. అలాగే మద్దులపల్లి గ్రామంలో పిచ్చికుక్క కాటుకు గురైన గేదెలకు మరియు ముందస్తుగా మిగిలిన గేదెలకు కలిపి సుమారు 25 గేదెలకు రేబిన్ నివారణ టీకాలు వేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సిబ్బంది కళ్యాణ్ లక్ష్మణ్ గ్రామ పాడి రైతులు పాల్గొన్నారు.