వెంకటాపురం చర్ల – రహదారి పైకి గోదావరి వరద నీరు

వెంకటాపురం చర్ల – రహదారి పైకి గోదావరి వరద నీరు

– రాకపోకలు నిలిపివేత –  బారికేడ్లు ఏర్పాటు

వెంకటాపురం నూగురు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం చర్ల ,భద్రాచలం రహదారి పైకి గోదావరి వరద నీరు చేరటంతో అదికారులు రాక పోకలు నిలిపీ వేశారు. రాకపోకలు నిలిపివేస్తూ హెచ్చరిక బోర్డులను బారికే డ్లను బోదాపురం వద్ద ఏర్పాటు చేశారు. వెంకటాపురం మండల పరిధిలోని వీరభద్రవరం వద్ద రహదారిపైకి గోదావరి వరద నీరు చేరుకున్నది. అలాగే ఆలుబాక, కొండాపురం వంతె న పైకి వరద నీరు చేరడంతో మండల తాసిల్దార్ లక్ష్మీరాజ య్య,  పోలీస్ శాఖ వారు వరద హెచ్చరికలు జారీ చేశారు. భోదాపురం, కొండాపురం వంతెన వద్ద హెచ్చరిక బోర్డ్ ను ఏర్పాటు చేస్తూ రాకపోకలు నిలిపివేశారు. అలాగే భద్రాచలం వెళ్లే ప్రయాణికులు వెంకటాపురం నుండి జగన్నాధపురం, ఎటురునాగారం మీదుగా మణుగూరు నుండీ భద్రాచలం ప్రాంతం ప్రయాణించవచ్చునని వెంకటాపురం ఎస్.ఐ కె.తిరు పతిరావు ప్రయాణీకులను కోరారు. ఈమేరకు పోలీస్ శాఖ గోదావరి వరద పట్ల జాగ్రత్తలు, భద్రతా పరమైన  అంశాలపై ప్రకటన విడుదల చేశారు. గోదావరి ఉధృతి గంటకు పెరుగుతుండటంతో పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యా యి. ఈ మేరకు ప్లడ్ డ్యూటీ అధికారులు అప్రమత్తం అయ్యా రు. వెంకటాపురం తాసిల్దార్ లక్ష్మీ రాజయ్య రెవెన్యూ సిబ్బం దితో కొండాపురం వంతెనతో పాటు, ముంపు ప్రాంతాలను పర్యటించి, గ్రామపంచాయతీ రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో అక్కడ రహదారిపై హెచ్చరిక బోర్డుల తో పాటు బార్కెట్లను ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతం గ్రామాల ప్రజల అప్రమ త్తంగా ఉండాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతుందని, ఈ సందర్భంగా ముంపు గ్రామాల ప్రజలకు తెలిపారు. వాగులు దాటవద్దని, చేపల వేటకు వెళ్ళరాదని, వరద ప్రమాద జాగ్రత్తలను ఈ సందర్భం గా మండల తాసిల్దార్ లక్ష్మీరాజయ్య, వెంకటాపురం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కే. తిరుపతిరావు ప్రజలకు వివరించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment