ఘనంగా ఐలమ్మ వర్ధంతి వేడుకలు
తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం:మండల కేంద్రంలో రైతు వేదిక నందు మండల రజక సంఘం అధ్యక్షులు పైడాకుల సమ్మయ్య ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 39వ వర్థంతి వేడు కలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో అనిత, ఆశ్రమ ఉన్నత పాఠశాల తెలుగు పండితుడు కోటయ్య, పాల్గొనడం జరిగింది.పలువురు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం రజకారులను ఎదిరించి పోరాడిన విరానిత చాకలి ఐలమ్మ అన్నారు. ఈ కార్యక్ర మంలో ఏఈఓ కల్యాణి, మండల రజక సంఘం ఉపాధ్య క్షుడు వేములవాడ రమేష్, కోశాధికారి సాయి బాబా, ప్రధాన కార్యదర్శి శ్రీరాముల సందీప్, కార్యదర్శి శ్రీరాముల రవి, గ్రామ అధ్యక్షులు శ్రీరాముల నరేష్, బడిపిల్లలు తదితరులు పాల్గొ న్నారు.