గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు
మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : మహాదేవ్ పూర్ మండలం లోని అన్ని గ్రామాల్లో అక్టోబర్ 15వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు పశువులకు 5 వ రౌండ్ గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించడమైనది. గాలికుంటు లక్షణాలు : ప్రతి రైతు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను తమ పశువులకు వేయించుకోవాలి, లేనిపక్షంలో వైరస్ వల్ల సోకే అంటువ్యాధి కావడంతో, పశువులు ప్రమాదకరమైన గాలి కుంటు వ్యాధి సోకి మరణించే ప్రమాదం ఉంది. పాలిచ్చే గేదెలకు, ఆవులకు గాలికుంటు వ్యాధి సోకినట్లయితే పాలు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. సూడి కట్టిన పశువులు గాలి కుంటు వ్యాధి సోకినట్లయితే కడుపులో దూడలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఎద్దులు బలహీనంగా తయారై పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. 104 నుంచి 106 డిగ్రీల జ్వరం ఉంటుంది. గిట్టల మధ్య పుండ్లు ఏర్పడుతాయి. నోటిలోపల, నాలుక మీద, ముట్టె లోపల భాగంలో బొబ్బలు ఏర్పడుతాయి. 24 గంటల్లోగా చిక్కిపోయి అల్సర్ కు గురవుతాయి. మేత మేయవు. చొంగ కారుస్తాయి. గిట్టల మధ్య పుండ్ల కారణంగా సరిగా నడవలేవు. ఒక్కోసారి పొదుగుపై కూడా బొబ్బలు రావడం వల్ల పొదుగువాపు వ్యాధి వస్తుంది. వ్యాధి సోకిన పశువుల పాలను తాగడం వల్ల దూడలు మరణిస్తాయి.
రైతుల్లో అవగాహనా రాహిత్యం
వ్యాధి పీడిత పశువులకు ఏ విధంగా చికిత్సలు చేయించా లనే అవగాహన రైతుల్లో కొరవడింది. టీకా వేయిస్తే పాల దిగుబడి తగ్గిపోతుందని రైతుల్లో తప్పుడు అభిప్రాయం ఉంది. టీకా వేసిన తర్వాత రెండు రోజుల పాటు పశువులకు జ్వరం వస్తుంది. దాని వల్ల ఆహారం తీసుకోవు, దరిమిలా పాల దిగుబడి తగ్గిపోతుంది. ఈ కారణం వల్ల చాలా మంది రైతులు మందు వేయించడానికి ముందుకు రాకుండా, ఆఖరికి పశు సంపదనే పోగొట్టుకుంటున్నారు. వ్యాధి వ్యాపించిన తర్వాత చికిత్స చేయించడం కన్నా ముందస్తు చర్యలతో సమర్థంగా నివారించుకోవచ్చు.
గాలి కుంటు నివారణకు వ్యాక్సినేషన్
రైతులు గాలికుంటు వ్యాధి సోకిన పశువును సకాలంలో గుర్తించి మిగతా పశువులతో దూరంగా ఉంచాలి. వెంటనే పశు వైద్యశాలకు తోలుకు వచ్చి వైద్యం చేయించాలి. గాలి కుంటు వ్యాధి కాకుండా ముందస్తుగా టీకాలు వేస్తున్నాం కావున రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకో వాలి. టీకాల కోసం మండలంలో మూడు బృందాలను ఏర్పా టు చేశాము. అన్నారం సెంటర్ పరిధిలోని గ్రామాలకు చెందిన పాడి రైతులు హరి నాయక్ (జె వి ఓ 9441596628)ను సంప్రదించగలరు. సూరారం సెంటర్ పరిధిలోని వారు కళ్యా ణ్ కుమార్ (ఎల్ ఎస్ ఏ 9100268248), మహదేవపూర్ కేంద్రానికి చెందిన రైతులు నాగభూషణం (విఏ94415587 54) ను సంప్రదించాలి. ఈ రోజు 626 పశువులకు టీకాలు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది లక్ష్మణ్, లా వణ్య మరియు గోపాల మిత్ర రాజబాబు, గ్రామ కార్యదర్శు లు , మాజీ సర్పంచ్ లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.