డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికీ జైలు శిక్ష
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నిందితులైన ఇద్దరికీ జైలు శిక్ష విధిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు మెజిస్ట్రేట్ రామచందర్ రావు తీర్పు వెలువరించారు. కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు ఎస్సై మ్యాక అభినవ్ తెలిపారు. కాటారం మండల కేంద్రానికి చెందిన బొడ్డు శ్రీధర్ కు నాలుగు రోజుల జైలు శిక్ష తోపాటు వేయి రూపాయల జరిమానా విధించారు. అలాగే అడవి ముత్తారం మండలం కనుకనూరు గ్రామానికి చెందిన రేగా నాగభూషణం అనే వ్యక్తికి రెండు రోజులు జైలు శిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విధించారు. ఇద్దరినీ పరకాల సబ్ జైలుకు తరలించారు.