పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
– యజమానులు తమ పశుసంపదకు విధిగా టీకాలు వేయించాలి
– మండల పశు వైద్యాధికారి డాక్టర్ నటరాజ్
వెంకటాపూర్ : మండల పరిధిలో ప్రతి ఏడాది సీజనల్ గా పశువులకు వచ్చే వ్యాధుల నివారణకు ముందస్తుగానే ప్రభు త్వ పరంగా పశుసంవర్ధక శాఖ సిబ్బంది వేసే గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు కార్యక్రమాన్ని గురువారం మండల పశు వైద్యాధికారి నటరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మూడు టీములుగా ఏర్పడి వెంకటాపూర్, లక్ష్మీదేవిపేట, నర్సాపూర్ గ్రామాలలో గాలికుంటు వ్యాధి టీకాలు చేపట్టారు. ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి డాక్టర్ నటరాజ్ మాట్లాడుతూ రైతులు,పెంపకం దారులు తమ పశువులకు విధిగా టీకాలు వేయించుకొని, వ్యాధి నిరోదక చర్యలు, జాగ్ర త్తలు వహించాలని కోరారు. ఆయా పంచాయతీలలో నెల రోజులు పాటు జరిగే గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం వెటర్నరీ,అసిస్టెంట్లు, సిబ్బంది ముమ్మరంగా చేప ట్టారని అన్నారు. ఉదయాన్నే వెటర్నరీ సిబ్బంది రైతుల ఇళ్లకు వెళ్ళి వారి పశువులకు టీకాలు వేస్తున్నారని తెలి పారు. గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆయా మూడు రోజులుగా ఆవులు, ఎద్దులు, గేదలు గాలి కుంటు టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పరంగా పశు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు, పెంపకం దారులు ఇళ్లకే నేరుగా వెళ్లి వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యాన్ని పశువుల యజమానులు, జీవాల యజమానులు సద్వినియోగం చేసుకొని, విలువైన పశు సంపదను, సీజనల్ వ్యాధుల నుండి కాపాడుకొని లబ్ధి పొందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ పశు వైద్యాధికారి జగపతి రావు, లక్ష్మీదేవి పేట పశు వైద్య అధికారి మహతి, పశు వైద్య సిబ్బంది కె స్వర్ణలత, ఏల్ రమేష్, రవి, ఓ. వేణు, రాజేందర్, ప్రశాంత్, తేజ, జె రమేష్, రాములు, శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు.