పురాతన ఆలయాలను ఉపయోగంలోకి తీసుకురావాలి
– జాకారంలోని శివాలయం పరిశీలన
– జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్.
ములుగు ప్రతినిధి : పురాతన శివాలయాన్ని ఉపయోగం లోనికి తీసుకొని రావాలని జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. అధికారులను ఆదేశించారు.గురువారం ములుగు మండలం జాకారం లోని శివాలయాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. పరిశీలించారు.ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆల యం చుట్టు ప్రక్కల ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని పంచాయితి శాఖ అధికారులను ఆదేశించారు. ఆలయం స్థల హద్దులను గుర్తించి పూర్తి వివరాలను సమర్పించాలని రెవిన్యూ అధికారులను సూచించారు. గుడిని అభివృద్ధి చేయుటకు పురావస్తు శాఖ అధికారులు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.