చెట్టు మీదపడి రెండు ఇండ్లు ధ్వంసం
తెలంగాణజ్యోతి,ఏటూరునాగారం : మండంలోని రామన్న గూడెం గ్రామంలో గురువారం రాత్రి భారీ ఈదురుగాలులకు పెద్ద వేప చెట్టు కూకటివేళ్లతో సహా నేలకొరింది. ఆ చెట్టు రెండు ఇండ్లపై పడటంతో పూర్తిగా ధ్వంసం అయ్యాయి. చెట్టు పడిన సమయయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రాణహాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంట్లో విలువైన వస్తువులు ధ్వంసం అయ్యా యి. విషయం తెలుసుకున్న సీపీఎం జిల్లా నాయకులు ఎండీ. దావూద్, వసంత నాగయ్య కుటుంబాలను పరామ ర్శించారు. రెవెన్యూ అధికారులు బాధితులకు న్యాయం చేయాలని, నష్టాన్ని అంచనా వేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం ద్వారా నూతన ఇళ్లు మంజూరు చేయా లని కోరారు.