గుడుంబా స్థావరాలపై మూకుమ్మడిగా మెరుపు దాడులు
కాటారం, తెలంగాణ జ్యోతి : కాటారం సబ్ డివిజన్ పరిధిలో గుడుంబా స్థావరాలపై పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. కాటారం సబ్ డివిజన్ పరిధిలో గుడుంబా తయారీ, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని ఉన్నత అధికారుల ఆదేశాల మేర కు శుక్రవారం కాటారం పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో గుడుంబా తయారీకి వినియోగిస్తున్న పరికరాలను, తయారీదారులను అదుపులోకి తీసుకొని నాటు సారాయి పానకం ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో ముగ్గురుపై కేసు నమోదు చేసి ఇద్దరిని పట్టుకున్నట్లు తెలిపారు. 13 లీటర్ల గుడుంబా, 400 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా కాటారం సిఐ నాగార్జున రావు మాట్లాడుతూ అసాంఘిక కార్యకలా పాలకు పాల్పడిన, చట్ట వ్యతిరేకమైన గుడుంబా అక్రమంగా అమ్మకాలు జరిపిన, తయారుచేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ అభినవ్, ఎక్సైజ్ ఎస్ ఐ కిష్టయ్య పోలీస్ సిబ్బంది, ఎక్సైజ్ సిబ్బంది తదితరు లు పాల్గొన్నారు.