జాతర ముందు ఐటీడీఏ పిఓ అంకిత్ బదిలీ
ములుగు, తెలంగాణ జ్యోతి : ఏటూరునాగారం ఐటీడీఏ పిఓ అంకిత్ ను మేడారం జాతర ముందు బదిలీ చేసినట్లు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏటూరునాగారంలో విధులు నిర్వహిస్తున్న ఐటీడీఏ పిఓ అంకిత్ ను నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్గా బదిలీ కాగా.. ఆయన స్థానంలో నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్గా ఉన్న చిత్రామిశ్రాను ఏటూరునాగారం ఐటిడిఏ పిఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, మేడారం జాతరకు మరో 9 రోజులు మాత్రమే ఉండగా.. పీఓ బదిలీ కావడంపై సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.