సీతమ్మధార జలపాతం కు పోటెత్తిన పర్యాటకులు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెం ప్రాజెక్టుకు అతి సమీపం లో ఉన్న సీతమ్మ ధార జలపాతం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. జలపాతం అతి సమీపంలోకి వాహనాలు సైతం వెళ్లే మార్గం ఉండటంతో పాటు, ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండే, ఈ సీతమ్మధార జలపాతం, ఆ నోట, ఈ నోట అంతటా పాకిపోవటంతో, ఆదివారం కుటుంబాలతో సహా సీతమ్మధార జలపాతం వద్దకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం 100 మీటర్లు మాత్రమే కాలినడక తో జలపాతం చేరుకునే విధంగా మార్గం ఉండటంతో పాటు, ఎటువంటి జలాశయం లేకుండా కొండలపై నుండి జాలువారే నీటి నురగలతో బండలపై నుండి కిందకు వెళ్ళిపోతున్నది .పైనుండి జాలువారే ధారలక్రింథ కుటుంబాలతో,పిల్ల పాపలతో సహా బండలపై కూర్చుని స్నానాలు చేసి సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సీతమ్మధార నూతన జల పాతం వెలుగులోకి రావడంతో, వెంకటాపురం మండలకేంద్రం కు 3.కిలోమీటర్ ల దూరం లో పాలెం ప్రాజెక్టు అతి సమీపం లో జలపాతం వుంది. బి.టి .రోడ్ పై జలపాతం వద్దకు వెళ్లే పర్యటకులతో పాలెం ప్రాజెక్టు రోడ్ రద్దీగా ఏర్పడింది. ఎటువంటి జల ప్రమాదాలు లేని, కాలినడక కూడా లేని, వాహనాలు వెళ్లే సీతమ్మధార జలపాతం కు పర్యాటకులు పోటెత్తుతున్నారు.