నేడు బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : దేవి శరన్నవరాత్రు ల్లో భాగంగా రోజుకో అవతారంలో అమ్మవారిని అలంకరించి భక్తుల అబీష్టానికి కాటారం మండలం బొప్పారం గ్రామంలో అమ్మవారి ఆలయం అంకురార్పణ చేస్తున్నారు. ఈ నేపథ్యం లో గురువారం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనం జరుగుతుందని పురోహితులు రామా చార్యులు తెలిపారు. ఈ ప్రాంతంలోని ప్రజలు, భక్తులు అమ్మ వారిని దర్శించుకొని, అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఆయన కోరారు. అమ్మవారిని కోరుకున్న వారికి, కోరిన కోరికలు తీర్చే వర ప్రధానిగా వర్ధిల్లుతున్న అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.