డీఎస్సీలో తెలుగు పండిట్ జిల్లా మొదటి స్థానం సాధించిన పుప్పాల బేబీ
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : ఇటీవల ప్రకటించిన డీఎస్సీ ఫలితాలలో వెంకటాపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామపంచాయతీకి చెందిన పుప్పాల బేబి తెలుగు పండిట్ గా ములుగు జిల్లాలో ప్రథమ స్థానం సాధించారు. ప్రాథమిక విద్యను నర్సింగాపూర్ ప్రాథమిక పాఠశాలలో 6 నుండి 9 తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్ష్మీదేవి పేట, పదవ తరగతి కరీంనగర్, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ ప్రభుత్వ కళాశాల ములుగులో చదివారు. వివాహం తర్వాత ఎంఏ తెలుగు, బి.ఎడ్ మంథనిలో పూర్తి చేశారు. 2023 లో జరిగిన గురుకుల రిక్రూట్మెంట్ పరీక్ష యందు పిజిటి తెలుగు లో తొమ్మిదవ ర్యాంకు సాధించి ప్రస్తుతం సుల్తానాబాద్ లో పిజిటి గా పనిచేస్తున్నారు. టి ఎస్ ఎస్ ఈ టి లో 75% తో ఉత్తీర్ణత సాధించి అందరి మన్ననలు పొందడం జరిగింది. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా భర్త ప్రోత్సాహంతో ఇంటి వద్దనే ఉండి అన్ని పోటీ పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలను సాధించిన బేబీ ని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, విద్యాభి మానులు అభినందిస్తున్నారు.