గురుకుల ప్రవేశ పరీక్షల్లో ముగ్గురికి సీట్లు

గురుకుల ప్రవేశ పరీక్షల్లో ముగ్గురికి సీట్లు

గురుకుల ప్రవేశ పరీక్షల్లో ముగ్గురికి సీట్లు

ములుగు, తెలంగాణ జ్యోతి : ప్రభుత్వం గురుకులాల్లో ఐదవ తరగతిలో ప్రవేశించడానికి నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో మల్లంపల్లి మండలం మంచినీళ్ల పల్లి ఎంపీపీఎస్ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులకు సీట్లు లభించినట్లు ప్రధానోపా ధ్యాయుడు వి.దిలీప్ తెలిపారు. ఈ విద్యార్థులను ఎంఈవో వజ్జతిరుపతి,డీసీఈబీచైర్మన్ సూర్యనారాయణ సన్మానించారు. భవిష్యత్తులో ఇదే ప్రగతిని కొనసాగిస్తూ ఉన్నత శికరాలను అధిరోహించాలని సూచించారు. ప్రభుత్వం పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన జరుగుతోందని, ఫలితాల ద్వారా నిరూపిత మవుతోందన్నారు. ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత విద్యా బోధనతో విద్యార్థుల్లో గుణాత్మక విద్యను పెంపొందించడానికి దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.దిలీప్, ఉపాధ్యాయుడు ఉమాశంకర్, గ్రామస్థులు గొర్రె కుమారస్వామి, నునేటి సురేష్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment