కరెంటు మీటర్ లేనివారు వెంటనే మీటర్ పొందండి
– వెంకటాపూర్ విద్యుత్ శాఖ ఏఈ ఎం సురేష్
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : ప్రభుత్వం నుంచి విద్యు త్ ఇంటి మీటర్ లేనివారికి మంచి సువర్ణ అవకాశం ప్రభు త్వం కల్పించిందని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని వెంకటాపూర్ విద్యుత్ శాఖ ఏఈ ఎం సురేష్ తెలిపారు. మంగళవారం లక్ష్మీదేవి పేట గ్రామపంచాయతీ ఆవరణంలో ఏఈ సురేష్ ఆధ్వర్యంలో ఇంటికి కరెంటు మీటర్ లేని వారిని కరెంటు మీటర్ డీడీలను కట్టించారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ మీటర్ లేని వారికి మంచి అవకాశం కల్పించిందని 250 వాట్స్ కి ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు డి డి కట్టాలని,500 వాట్స్ కి 938 రూపాయలు డిడి కట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ సాంబరాజు,ఎల్ ఐ సమ్మిరెడ్డి, అసిస్టెంట్ లైన్మెన్ ఆర్ కృష్ణకర్, ఆనమాండ్ గోదిరే సూరి పంచాయతీ సెక్రటరీ దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు.