రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి
తెలంగాణ జ్యోతి, ప్రతినిధి ఎటూరునాగారం: మండలం కేంద్రంలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. రజక సంఘం అధ్యక్షులు ముక్కెర లాలయ్య మాట్లాడుతూ వెట్టి చాకిరి విముక్తి కోసం దొరల గడిలన దౌర్జన్యం అన్యా యాలను దోపిడీలను గుత్తేదారుల పెట్టుబడి సామ్రాజ్యవాదా న్ని ఎదిరించి పోరాడిన సాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఇట్టి కార్యక్రమానికి ముకేర లాలయ్య, ప్రధాన కార్యదర్శి పర్వతాల ఎల్లయ్య, ముక్కెర సరిత,చింతలపల్లి సుమన్, కుదురుపాక గిరిబాబు, రఘుపతి, గౌరీ శంకర్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు