విద్యుత్తు జీరో బిల్లులు రానివారు మరలా దరఖాస్తులు చేసుకోవాలి

Written by telangana jyothi

Published on:

విద్యుత్తు జీరో బిల్లులు రానివారు మరలా దరఖాస్తులు చేసుకోవాలి

– విద్యుత్ శాఖ ఏ.డి.ఈ .ఆకేటి స్వామి రెడ్డి. 

వెంకటాపురం నూగురు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో జీరో కరెంట్ బిల్లు రానివారు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని, అర్హులైన వారు తగిన దృవీకరణ పత్రాలతో ఆయా మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకో వాలని వెంకటాపురం విద్యుత్ శాఖ సహాయ సంచాలకులు ఆకేటి స్వామిరెడ్డి తెలిపారు.శనివారం ఆయన మాట్లాడుతూ వెంకటాపురం మండలంలో గృహ అవసరాలు విద్యుత్ కలెక్షన్లు 9 వేలు ఉన్నాయన్నారు. అలాగే వాజేడు మండలం లో 7 వేల గ్రుహవసరాల సర్వీస్ కనెక్షన్లు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు వెంకటాపురం మండలంలో 4,700 గృహ అవసరాల సర్వీసులకు జీరో బిల్లు మంజూరు అయిందని, వాజేడు మండలంలో 3,800 గ్రుహ సర్వీసులకు విద్యుత్ కనెక్షన్లకు జీరో బిల్లు మంజూరు అయిందని తెలిపారు. అర్హులై ఉండి జీరో బిల్లు రాని వినియోగదారులు తగిన దృవీకరణ పత్రాలతో తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. విద్యుత్తు లైన్లు వెంట చెట్ల కొమ్మలు పెరిగి పోవడం వల్ల తీగెలపై వాలటం వలన విద్యుత్ సరఫరా కు అంతరా యం లేకుండా నిరంతర సరఫరా నిమిత్తం, ట్రీ కటింగ్ నిర్వహి స్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాలు గాలుల కారణంగా, ఏ ప్రాంతంలోనైనా, చెట్లు విరిగి విద్యుత్ లైన్ల పై పడితే వెంటనే ఆయా గ్రామాల ప్రజలు, అప్రమత్తంగా వుండి సమీపం లోని విద్యుత్ శాఖ కు తెలియపరచాలని ఈ సందర్భంగా కోరారు. వెంకటాపురం మండల కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్ద శనివారం ఉదయం వర్షాలు కారణంగా చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్తు లైనుపై పడటంతో, విద్యుత్ సిబ్బందితో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించి, సాయంత్రానికల్లా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపారు.

Leave a comment