కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత 

Written by telangana jyothi

Published on:

కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు మండలం మండపాక వద్ద శనివారం వాజేడు సెకండ్ ఎస్.ఐ. ఇమ్మానియేల్ సిబ్బందితో వాహనాల తనిఖీలు నిర్వహిం చారు. ఈతనిఖీలలో  ఎటువంటి అనుమతులు లేని మద్యం బాక్సులను, తరలిస్తున్న కారును  స్వాధీనం చేసుకున్నారు. ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లికి చెందిన తేజ అనే వ్యక్తి ని అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వాజేడు ఎస్సై రుద్ర హరీష్ శనివారం సాయంత్రం మీడియాకు తెలిపారు.

Leave a comment