మనుగడ ఉండదనే రాజ్యాంగం గురించి చెప్తలేరు
– సమాజాన్ని వాడుకుని కోట్లు సంపాదిస్తున్న దుద్దిళ్ల కుటుంబం
– ఓటు వినియోగంలో విఫలం కావడంతో ఒక్క కుటుంబం రాజ్యమేలుతాంది
– మహనీయుల స్పూర్తితోనే ఆనాడు తెలంగాణ సాధించిన కేసీఆర్
– దీక్ష విరమణలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
కాటారం,ఏప్రిల్ 14, తెలంగాణజ్యోతి: మహనీయుల చరిత్ర, రాజ్యాంగం లో పొందుపర్చిన అంశాలను ప్రజలకు అర్థం అయితే మనుగడ ఉండదనే ఆలోచనతోనే మూడు ఓట్లు ఉన్న కుటుంబం తెలివిగా ఈ సమాజాన్ని వాడుకుంటుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కాటారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్ తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం మర్రిపెల్లి సర్పంచ్ ఊర వెంకటేశ్వర్రావు నివాసంలో దీక్ష విరమణ చేసి సహపంక్తి బోజనాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో 80శాతానికి పైబడి ఉన్న వర్గాలకు న్యాయం జరుగడం లేదని, మహనీయులు ఎవరో తెలియదు. రాజ్యంగంలో ఏముందో తెలియక పోవడం మూలంగానే అన్యాయానికి గురవుతున్నారని, అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకురావాలనే సంకల్పంతోనే మహనీయుల స్పూర్తి దీక్షను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నడే గాని మంథని ఎమ్మెల్యే దాని ముఖం చూడడు చూపించే ప్రయత్నం చేయడన్నారు. మూడు ఓట్లు ఉన్న కుటుంబానికి 40ఏండ్లు ఓట్లు వేసి అధికారం ఇస్తే వేలకోట్లు కూడబెట్టు కుంటున్నారన్నారు. మహనీయులు అర్థం అయిన నాడే ఆకలి అంటే అర్థం అయిందని గౌరవం అంటే తెలుస్తదని, ఈ క్రమంలో పూలే జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ జయంతి వరకు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీల చైతన్యం కోసం దీక్ష కొనసాగిస్తున్నట్లు వివరించారు. సామాజిక సృహా ఉన్నవాళ్లు రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్లు దీక్షకు మద్దతు తెలుపుతున్నారని, ఇంకా ఈ సమాజం అణగారే ఉండాలి అభివృద్ది చెందవద్దననుకునే మంథని ఎమ్యెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు వ్యతిరేకిస్తరన్నారు. ఆనాడే అంబేద్కర్ గొప్పగా ఆలోచన చేసి రాజ్యాంగంలోఅర్టికల్ 03ను పొందుపర్చిండని, చిన్నరాష్టాలు కావాలంటే పెద్ద రాష్ట్రాలు ఒప్పుకోరనే ఆలోచనతో పార్లమెంట్‌కు ఆ ఆధికారం ఇచ్చారని, ఈ క్రమంలో కేసీఆర్ మహనీయుల స్పూర్తితోనే తెలంగాణ సాధించారన్నారు. అంబేద్కర్ అందించిన ఓటును వినియోగంచు కోవడంలో మన వషయం అవుతున్నాం కనుకనే మూడు ఓట్లు ఉన్న కుటుంబం రాజ్యం ఏలుతోందన్నారు. పది సంవత్సరాల వరకు రిజర్వేషన్ లు ఉండాలని తదనంతరం అందరూ సమానంగా ఎదగాలని అంబేద్కర్ కాంక్షిస్తే పాలించిన పాలకులు 78ఏండ్ల తర్వాత కూడా ఇంకా ఆకలితో అలమటిస్తూ రిజర్వేషన్లపై ఆధారపడి జీవిస్తున్న పరిస్థితులను చూసిన వెంకటేశ్వర్రావు ఖచ్చితంగా ఈ రాజ్యాంగం అర్థమై వర్థల్లినప్పుడే అందరూ సమానమైతరని గొప్పగా ఆలోచన చేశారని, మీరంతా ఇంటికి రావాలే నేను బోజనం పెడుతానని మమ్మల్ని ఆహ్వనించారని ఆయన వివరించారు. నియోజకవర్గంలో మహనీయుల చరిత్ర అర్థం అయ్యే వరకు ప్రతి ఏటా దీక్షను కొనసాగిస్తామని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు.









