హనుమాన్ జెండాలతో భారీ బైక్ ర్యాలీకి పిలుపు
ములుగు,ఏప్రిల్14, తెలంగాణజ్యోతి:హిందూ సమ్మేళనం కార్యక్రమానికి మద్దతుగా 500 ద్విచక్ర వాహనాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ములుగులో హనుమాన్ జెండాలతో ఏప్రిల్ 15 సాయంత్రం 4గంటలకు డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి ర్యాలీ ప్రారంభ మవుతుందన్నారు. హిందూ సనాతన ధర్మ పరిరక్షణకు ఈ ర్యాలీ చేపడు తున్నట్లు తెలిపారు. యువత, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఉత్సవ సమితి అధ్యక్షుడు గండ్రకోట కుమార్ పిలుపునిచ్చారు. ములుగు ప్రధాన రహదారులు, పురవీధులలో ర్యాలీ కొనసాగనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.









