జిల్లా పరిషత్ హై స్కూల్లో పాము కలకలం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురం పట్టణంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం భారి కట్లపాము తరగతి గదిలోకి ప్రవేశించి కలకలం రేపింది. పాఠశాలలో ఆరో తరగతి నుండి 10వ తరగతి వరకు సుమారు 580 మంది విద్యార్థులు చదువు కుంటున్నారు. విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల ప్రాంగణం లోకి చేరుకునే సమయంలో గదులు శుభ్రం చేసే వారికి తరగ తి గదిలో సుమారు 6 అడుగుల పైగా పొడవున్న కట్లపాము కనపడింది. దీంతో వారంతా హా హాకారాలు చేస్తూ తరగతి గది నుండి బయటకు పరుగులు తీశారు. ఇరుగు పొరుగు వారికి పాము సమాచారం తెలిసింది. పాఠశాల ఉపాధ్యా యులు క్లాస్ రూమ్ లో పాము విషయంపై వెంకటాపురం అటవీశాఖ అధికారులకు చరవాణి ద్వారా సమాచారం ఇచ్చిన వారి నుండి ఎటువంటి స్పందన లేదు అప్పటికే గది లో అటు ఇటు సంచరిస్తున్న భారీ కట్లపామును ఇరుగు పొ రుగు వారు హతమార్చారు. తరగతి గదిలోకి పాము జొర బడటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, భయ బ్రాంతులకు గురయ్యారు. పామును చంపి వేయడంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు.