గారెపల్లి స్మశాన వాటికకు బెంచీల వితరణ
కాటారం, తెలంగాణజ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండలం గారేపల్లి స్మశాన వాటిక వద్ద వృద్ధులు కూర్చోవడానికి రెండు బెంచీలను అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. గారేపల్లికి చెందిన ప్రముఖ వ్యాపారులు తమ తండ్రి జ్ఞాపకార్థం బెంచీలను వితరణ చేసి నట్టుగా వారు పేర్కొన్నారు. స్వర్గీయ అనంతుల శేఖ, కము టాల రాజేశం ల జ్ఞాపకార్థం వారి కుమారులు అనంతుల శ్రీనివాస్, కముటాల రవీందర్ లు రెండు సిమెంట్ బెంచీ లను ఏర్పాటు చేశారు. స్మశాన వాటిక వద్ద వృద్ధులు, చిన్నారులు, ఇతరులు కూర్చోవడానికి అనుకూలంగా ఏర్పాటుచేసిన బెంచీలవల్ల ఎంతో ప్రయోజనం ఉందని, పలువురు సోషల్ మీడియా వేదికగా బెంచీలు అందజేసి ఉదారతను చాటు కున్న దాతలను అభినందించారు.